భారత్‌లో ఎన్నో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి : మోదీ
భారతదేశం గాంధీ సిద్ధాంతాలను పాటిస్తుందని…. ఆయన మార్గం ఇప్పటికీ అనుసరణీయమని ఐరాస సదస్సు వేదికగా మోదీ వెల్లడించారు.
అభివృద్ధి చెందుతున్న భారత్‌లో ఐదేళ్లలోనే 11కోట్ల సౌచాలయాల నిర్మాణం జరిగిందని… ఇది ప్రపంచానికి కొత్త సందేశంగా తెలిపారు.
డిజిటలైజేషన్ ద్వారా అవినీతికి అడ్డుకట్టవేసే ప్రయత్నం చేస్తున్నామని…. ఇప్పటికే 20బిలియన్ డాలర్లు మేర ప్రజాధనం ఆదా అయిందని అన్నారు.
అక్టోబర్ 2నుంచి సింగిల్‌యూజ్ ప్లాస్టిక్‌ను నిషేధిస్తున్నామని….. 15కోట్ల కుటుంబాలకు రక్షిత మంచినీరు అందించనున్నామని…. 75వ స్వాతంత్ర్య దినోత్సవం నాటికి 2కోట్ల మంది పేదలకు ఇళ్లు నిర్మిస్తామని తెలిపారు.
అలాగే ప్రజారోగ్య దృష్ట్యా 2025నాటికి క్షయ విముక్త భారత్ లక్ష్యాన్ని చేరుకుంటామని….. భారత్‌లోని పేదలకు 5లక్షల రూపాయల విలువైన ఆరోగ్యబీమా కల్పిస్తున్నామని ఇది ఒక శుభపరిణామమని అన్నారు.
అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ప్రజలు తమ ప్రభుత్వానికి రెండోసారి కూడా అవకాశం ఇచ్చారని….. ప్రజలు ఇచ్చిన భారీ ఆధిక్యత వలనే ఇక్కడికి వచ్చే అవకాశం కలిగిందని పేర్కొన్నారు.
ప్రపంచ దేశాలను పట్టిపీడిస్తున్న మహమ్మారి ఉగ్రవాదమని… ఉగ్రవాదంపై పోరులో ప్రపంచమంతా ఏకం కావలసి ఉందని అన్నారు.