భవిత పాఠశాల విద్యార్థులకు పండ్లు, బిస్కెట్లు పంపిణీ చేసిన జడ్జి రాఘవేంద్ర

భవిత పాఠశాల విద్యార్థులకు గురువారంనాడు పొదిలి జూనియర్ సివిల్ జడ్జి కోర్టు జడ్జి ఎస్.సి రాఘవేంద్ర పండ్లు బిస్కెట్లు పంపిణీ చేశారు.

వివరాల్లోకి వెళితే ప్రపంచ మానసిక వికలాంగుల దినోత్సవం సందర్భంగా స్థానిక మండల పరిషత్ కార్యాలయ ప్రాంగణంలోని భవిత పాఠశాల దివ్యాంగ విద్యార్థులైన పిల్లలకు పండ్లు, బిస్కెట్లు పంపిణీ చేసిన జడ్జి రాఘవేంద్ర మాట్లాడుతూ మానసిక వికలాంగులైన దివ్యాంగ విద్యార్థులు త్వరగా కోలుకోవాలని…. వారిలోని నైపుణ్యాలను పెంపొందించేందుకు వారి తల్లిదండ్రులతో సమానంగా వారికి ఉన్నలోపాలను మర్చిపోయేలా భవిత పాఠశాల సిబ్బంది పిల్లలకు ప్రత్యేక శిక్షణనిస్తూ వారితో మమేకవ్వడం అభినందనీయమని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ న్యాయవాదులు, భవిత పాఠశాల సిబ్బంది, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.