భవిత పాఠశాలకు నీటినిల్వ అవసరాల బహుకరణ….
స్థానిక మండల పరిషత్ కార్యాలయ ప్రాంగణంలోని భవిత దివ్యాంగ చిన్నారుల పాఠశాలకు మండల విద్యాశాఖ అధికారి రఘురామయ్య ఆధ్వర్యంలో నీటినిల్వ అవసరాలను బహుకరించారు.
ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారి రఘురామయ్య మాట్లాడుతూ తీవ్రమైన ఎండలు, నీటి ఎద్దడి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని దివ్యాంగ విద్యార్థుల పాఠశాలకు రెండు నీటి డ్రమ్ములు, వాటర్ పైపును బహుకరించిన షేక్ మౌలాలి, షేక్ రసూల్, ఉపాధ్యాయులు నాయబ్ రసూల్ గారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో భవిత పాఠశాల సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.