భూమి విషయమై దాయాదుల మధ్య ఘర్షణ…. వ్యక్తి మృతి మరొకరికి గాయాలు
భూమి విషయంలో జరిగిన వివాదంలో ఓ వ్యక్తి మృతిచెందగా మరో వ్యక్తి గాయపడిన సంఘటన బుధవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే పొదిలి మండలం ఏలూరు గ్రామంనందు భూమి విషయమై దాయాదులైన చిన్నపురెడ్డి రామసుబ్బారెడ్డికి….. చిన్నపురెడ్డి రమణారెడ్డికి జరిగిన ఘర్షణలో చిన్నపురెడ్డి రమణారెడ్డి పొలం దున్నుతున్న సమయంలో చిన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి ట్రాక్టరుతో తొక్కించడంతో రమణారెడ్డి, శ్రీనివాసరెడ్డిలకు తీవ్ర గాయాలవడంతో గాయపడిన ఇద్దరిని బంధువులు ఒంగోలు రిమ్స్ కు తరలిస్తున్న క్రమంలో మార్గం మధ్యలో రమణారెడ్డి మృతి చెందగా మృతదేహాన్ని రిమ్స్ కు తరలించారు. ఈ సంఘటనలోనే గాయాలపాలైన శ్రీనివాసరెడ్డి ప్రస్తుతం రిమ్స్ లో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని తీరును పరిశీలించి అనంతరం ఒంగోలు రిమ్స్ కు చేరుకుని గాయపడిన శ్రీనివాసరెడ్డి వద్ద వివరాలు సేకరిస్తున్నారు