బిజిలి బంద్ ను జయప్రదం చేయండి
ప్రత్యేక హోదా సాధన కై మంగళవారం సాయంత్రం 7 .00 గంటల నుండి 7.30 వరకు విద్యుత్ దీపాలను నిలిపివేసి బిజిలి బంద్ ను ప్రజలు విజయవంతం చేయలని అఖిల పక్షం నాయకులు సోమవారం ఉదయం స్ధానిక రోడ్లు భవనల అతిధి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రజలకు విజ్ఞప్తి చేసారు ఈ సమావేశంలో జడ్పీటిసి సాయి రాజేశ్వరరావు కాంగ్రెసు పార్టీ నాయకులు షేక్ సైదా సిపియం రమేష్ సిపిఐ నాయకులు ఏసురత్నం వైసీపీ నాయకులు కందుల రాజశేఖర్ వెలుగొలు కాశీ తదితరులు పాల్గొన్నారు