బీహార్ జైలులో జన్మదిన వేడుకలు చేసుకున్న ఖైదీ….. చరవాణిలో సంభాషణలు….. విచారణ ప్రారంభించిన అధికారులు
బీహార్ రాష్ట్రంలోని జైల్లో ఒక ఖైది తన జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించడంతో పాటు చరవాణిలో సంభాషణలు జరపడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
బీహార్ రాష్ట్రంలోని సీతామర్తి జైల్లో పింటూ తివారీ అనే క్రిమినల్ జైలు జీవితంలో కూడా సమాజంలో జీవిస్తున్న వ్యక్తిలా జైలులో జన్మదిన వేడుకలు చేసుకోవడంతో పాటు బయట నుండి తెచ్చిన మాంసాహారం భుజించడం చరవాణిలో సంభాషణలు జరపడం వంటి జైలు నియమనిబంధనలను విరుద్ధంగా చేసిన చర్యల వీడియో వైరల్ అవ్వడంతో దేశవ్యాప్తంగా సంచలనమైంది.
వీడియో వైరల్ కావడంతో బీహార్ పోలీసులు పుట్టినరోజు వేడుకలు నిర్వహించడం, చరవాణి ఎలా చేరిందనే విషయంపై విచారణ ప్రారంభించారు.