ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో ద్విచక్ర వాహనాల ర్యాలీ

ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో పిఆర్సీ ,డిఎలు మంజూరు, సిపియస్ రద్దు చేయాలని కోరుతూ విశ్వానాథపురం నుంచి పెద్ద బస్టాండ్ , మీదుగా చిన్న బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య పొదిలి చైర్మన్ షేక్ అబ్దుల్ మాట్లాడుతూ పిఆర్సీ వెంటనే అమలు చేయాలని పెండింగ్లో ఉన్న ఆరు డి ఎ ను వెంటనే విడుదల చేయాలని మరియు సిపిఎస్ రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో వివిధ ఉపాధ్యాయ సంఘాలు నాయకులు రాష్ట్ర కౌన్సిలర్ రమణ రెడ్డి ,ఆడిట్ కమిటీ సభ్యులు ఎస్కే రాజేశ్వరరావు ,జిల్లా కమిటీ సభ్యులు బుజ్జి బాబు, చావలంవెంకటేశ్వర్లు, అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బాల కాశి రెడ్డి ఎం నాగార్జున,గోనె శ్రీనివాసులు ,సీనియర్ ఉపాధ్యాయులు తిరుపతి రెడ్డి ,సంజీవ రావు, సత్యనారాయణ రెడ్డి, సింగంపల్లి సుబ్బారావు ,జి రమణ రెడ్డి ,సుమారు 70 మంది ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.