బైక్ ట్రాలీ చిన్న సన్నకారు రైతులకు ఉపయోగకరం
దరిశి మండలం తిమ్మయిపాలెం గ్రామం చెందిన నాగార్జున రెడ్డి బెంగళూరు లో హాస్టల్ నిర్వాహకులు ఉంటూ కరోనా వైరస్ మూలం గా లాక్ డౌన్ పరిస్థితుల్లో హాస్టల్ మూసి వేసి స్వగ్రామానికి వచ్చిన తర్వాత ఏదైనా వ్యాపారం పెడదాం అనుకొనే సమయంలో వ్యవసాయదారులు పశువులకు మేతను ద్విచక్ర వాహనం పై తీసుకొని వెళ్ళుతు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నా విషయం పై దృష్టి పెట్టి 100 సిసి కల్గిన బైక్ తో ట్రాలీని తయారు చేసి వాడకం లోకి తీసుకొని వచ్చిన తర్వాత పలువురు రైతులు తమకు ఇలాంటి ట్రాలీ కావాలని అడగటంతో ట్రాలీ తయారు పరిశ్రమ పెడితే బాగుంటుందని భావించి ఉషా ఇంజనీరింగ్ వర్క్స్ పరిశ్రమను ఏర్పాటు చేసి ఇప్పటివరకు 7 ర్యాలీలు అమ్మకాలు జరపినని నాగార్జున రెడ్డి తెలిపారు.
ట్రాలీ ప్రచారంలో భాగంగా పొదిలి పట్టణ జూనియర్ కళాశాల రోడ్ నందు ట్రాలీని నడిపి ట్రాలీ యొక్క సామర్థ్యం గురించి వివరంగా తెలిపారు ట్రాలీ కావాలంటే 9121265499 ను సంప్రదించాలని కోరారు