రాబోయే ఎన్నికల్లో బిజెపి సొంతంగా పోటి : బిజెపి రాష్ట్ర కార్యదర్శి శశిభూషన్ రెడ్డి
బారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో జరిగే ఎన్నికల్లో సొంతంగా పోటీ చేస్తుందని రాష్ట్ర కార్యదర్శి ప్రకాశం జిల్లా భాద్యులు శశిభూషన్ రెడ్డి అన్నారు. స్థానిక బిజెపి నాయకులు మాగులూరి రామయ్య నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2014 ఎన్నికల్లో బిజెపితో పొత్తు పెట్టుకుని అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ నాలుగు సంవత్సరాల పాటు కలిసి ఉండి వైసీపీ ట్రాప్ లో పడి కేంద్ర ప్రభుత్వం ఎన్డీయే నుండి బయటకు వచ్చి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంపై ప్రధాని నరేంద్ర మోడీపై అసత్య ప్రచారాలు చేస్తుందని అన్నారు.ఇటీవల నిర్వహించిన పలు సర్వేలలో రాష్ట్రంలో బిజెపికి 12.5 ఓటు బ్యాంకు ఉన్నట్లు నిర్ధారణ చేశారని క్షేత్ర స్ధాయి పార్టీ బలంగా నిర్మించి రాబోయే ఎన్నికల్లో బిజెపిని నిర్ణయాత్మక శక్తిగా ఎదిగే విధంగా ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు లక్ష్మీ నారాయణ, మండల నాయకులు మాగులూరి రామయ్య, ఆకుపాటి లక్ష్మణ్, భారతీయ జనతా యువ మోర్చా మండల అధ్యక్షులు దాసరి మల్లి, తదితరులు పాల్గొన్నా