మహిళ ఆరోగ్య కార్యకర్తలకు శానిటైజర్లు , మాస్క్ లు పంపిణీ చేసిన భాజపా
మహిళ ఆరోగ్య కార్యకర్తలకు శానిటైజర్లు ,మాస్క్‌ల ను భారతీయ జనతాపార్టీ నాయకులు పంపిణీ చేశారు.
వివరాల్లోకి వెళితే ఆదివారం నాడు స్థానిక ఎన్జీఓ హోం నందు మండలంలో పనిచేస్తున్న మహిళ ఆరోగ్య కార్యకర్తలకు శానిటైజర్లు మాస్క్ ను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా భారతీయ జనతాపార్టీ మండల అధ్యక్షులు మాకినేని అమర్ సింహా మాట్లాడుతూ భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఏడు సంవత్సరాల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా నేడు మండలంలో పనిచేస్తున్న మహిళ ఆరోగ్య కార్యకర్తలకు, అదే విధంగా ఏడు గ్రామాల్లో శానిటైజర్స్ మాస్క్ పంపిణీ చేసినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో భారతీయ జనతాపార్టీ నాయకులు చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు