వీరమరణం పొందిన సైనికులకు నివాళులర్పించిన బిజెపి
భారత్ – టిబెట్ సరిహద్దు గాల్వన్ లోయలో భారత్ చైనా సైనికుల మధ్య ఘర్షణలో వీర మరణం చెందిన సైనికులకు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు.
వివరాల్లోకి వెళితే స్థానిక ఆంధ్ర బ్యాంకు వీధి నందు ఒక వ్యాపార సంస్థ నందు శుక్రవారంనాడు కల్నన్ సంతోష్ బాబు చిత్రపటానికి పూలమాలలు వేసి అనంతరం సైనికుల వీర మరణం పట్ల మౌనం పటించి శ్రద్దాంజలి ఘటించారు.
ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నాయకులు సూరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, మాగులూరి రామయ్య, మాకినేని అమరసింహ, ఆకుపాటీ లక్ష్మణ, డేగా ఏడుకొండలు, నాగేశ్వరరావు, పువ్వాడ నారాయణ, జక్కంపూడి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.