భాజపా విజయత్సవ సంబరాలు
కర్నాటక శాసనసభ సాధారణ ఎన్నికల లో భారతీయ జనతా పార్టీ అతిపెద్ద పార్టీ గా అవతరించటం పై పొదిలి పట్టణంలో భాజపా కార్యకర్తలు పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చి మిఠాయిలు పంచిపెట్టారు. భాజపా జిల్లా నాయకులు గుద్దేటి సుబ్బారావు మాట్లాడుతూ దక్షిణాదిలో బిజెపి బలోపేతం కాకుండా ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా కర్నాటక ప్రజలు బిజెపి కి పట్టం కట్టారని అన్నారు భాజపా నాయకులు మువ్వల పార్ధసారధి మాట్లాడుతూ రాబోయే ఎన్నికలలో ఆంద్రప్రదేశ్ లో కూడా బిజెపి ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో భాజపా మైనారిటీ మోర్చా జిల్లా కార్యదర్శి సయ్యద్ ఖాదర్ భాషా , బిజెపి నాయకులు సూరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, మాగులురి రామయ్య, ఆకుపాటి లక్ష్మణ, పందింటి మురళి , రావూరి సత్యనారాయణ, భారతీయ జనతా యువ మోర్చా మండల అధ్యక్షులు దాసరి మల్లి తదితరులు పాల్గొన్నారు.