బిజెపి ఆద్వర్యంలో గాంధీ సంకల్ప యాత్ర

భారతీయ జనతా పార్టీ ఆద్వర్యంలో గాంధీజీ సంకల్ప పాదయాత్ర నిర్వహించారు .వివరాలులోకి వెళితే గురువారం నాడు స్ధానిక చిన్న బస్టాండ్ నుండి పెద్ద బస్టాండ్ మీదాగా ఆర్టీసీ బస్టాండ్ విశ్వనాథపురం ప్రధాన విధులు గుండా గాంధీజీ సంకల్ప యాత్ర కొనసాగింగి అనంతరం బిజెపి నాయకులు మాట్లాడుతూ జాతిపిత మహాత్మాగాంధీ కలలుగన్న స్వచ్ఛ భారతావణిని సాధించే క్రమంలో గాంధీ గారి 150 వ జయంతిని పురస్కరించుకుని భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా గాంధీ ఆశయాలను సిద్ధాంతాలను దేశ ప్రజల దృష్టికి తీసుకు వెళ్లేందుకు హింసకు తావు లేకుండా ఈనాటి యువతరాన్ని చైతన్య పరచవలసిన ఆవశ్యకతను గుర్తించి “గాంధీజీ సంకల్ప యాత్ర” పేరుతో పాదయాత్రను నిర్వహింస్తున్నమని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు సరోజిని శివాజీ మాగులురి రామయ్య సత్యలు పందింటి మురళి శ్రీనువిసులరెడ్డి లక్షణ్ తదితరులు పాల్గొన్నారు