బిజెపి అనుసరించే విధానాల మూలంగానే దేశంలో ఆర్థికమాంద్యం : సిపిఐ జిల్లా కార్యదర్శి నారాయణ

భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అనుసరించే విధానాల మూలంగానే నేడు దేశంలో ఆర్థికమాంద్యం ఏర్పడిందని భారత కమ్యూనిస్టు పార్టీ ప్రకాశంజిల్లా శాఖ కార్యదర్శి ఎం ఎల్ నారాయణ అన్నారు.

స్ధానిక లెనిన్ భవన్ నందు తనను కలిసిన విలేకరులతో నారాయణ మాట్లాడుతూ ఏ దేశంలో ఆర్థికమాంద్యం ఏర్పడినా సామాన్యుడి
కొనుగోలు శక్తిని పెంచడానికి అనేక పథకాలు తీసుకుని వస్తుంటే భారత ప్రధాని నరేంద్ర మోదీ మాత్రమే 2005జాతీయ ఉపాధి హామీ పథకాన్ని కూడా నిర్వీర్యం చేస్తున్నారని…. సామాన్యుడి కొనుగోలు శక్తిని పెంచేవిధంగా ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని కార్మికులకు 18వేల నుండి 21వేల వరకు కనీసం వేతనం ప్రకటించాలని అన్నారు.

దేశంలో ఆర్థిక సంక్షోభం ఉంటే అవి పరిష్కారించకుండా మతాల మధ్య చిచ్చుపెట్టి మారణహోమాలను బిజెపి ప్రభుత్వం సృష్టింస్తోందని అన్నారు. ఇదిలావుంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యక్షంగా 15లక్షల మందికి ప్రయోజనం కలిగే అన్న క్యాంటిన్లను రద్దు చేయడం…. రైతు భరోసా ద్వారా 12500ఇస్తానన్న జగన్మోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 6500కలుపుకొని 13500 ఇస్తాననడం మోసం పూరితమైనదని అదేవిధంగా రైతు భరోసా లబ్ధిదారుల జాబితా తప్పుతడకలుగా ఉందని…… అదేవిధంగా అనేక సంక్షేమ పథకాల అమలు హామీలను సక్రమంగా పూర్తి చెయ్యాలని డిమాండ్ చేశారు.