ఢిల్లీ పీఠం బిజెపిదే…. బిజెపి రాష్ట్ర అధ్యక్షులు మనోజ్ తివారీ

ఢిల్లీ శాసనసభ పీఠాన్ని భారతీయ జనతాపార్టీ కైవసం చేసుకుంటుందని ఢిల్లీ రాష్ట్ర పార్టీ అధ్యక్షులు మనోజ్ తివారీ ట్విట్ చేసారు.

ఫిబ్రవరి 11వ తేది ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయని ఆ రోజు భారతీయ జనతాపార్టీ 48 సీట్లు పైగా సాధిస్తుందని నమ్మకం వ్యక్తం చేశారు. ప్రస్తుతం కొన్ని సంస్థలు ఎగ్జిట్ పోల్స్ లో బిజెపికి 26స్ధానాలు వస్తాయన్న ప్రచారంలో ఏ మాత్రం నిజం ఉండదని ఖచ్చితంగా బిజెపి అధికారంలోకి వస్తుందని ఆయన తెలిపారు.