సల్లూరు ఘటన సభ్య సమాజం తలదించుకోనే సంఘటన – బిసివై వ్యవస్థాపక అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్

ప్రకాశం జిల్లా పొదిలి మండలం సల్లూరు గ్రామంలో యాదవ సామాజిక వర్గానికి చెందిన యలగల వెంకటేశ్వర్లు మృతదేహానికి అంత్యక్రియలు అడ్డుకున్న సంఘటన పై భారత చైతన్య యువజన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ సల్లూరు గ్రామంలో పర్యటించి భాధిత కుటుంబం సభ్యులను పర్యటించి వారికి సంఘీభావం ప్రకటించారు

నిన్ను ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు జరిగిన సంఘటనలు గురించి ఆయన దృష్టికి తీసుకొని వెళ్ళారు.

ఈ కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి యాదవ మహాసభ నాయకులు కార్యకర్తలు, బిసివై పార్టీ నాయకులు, వివిధ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు