రెండు నివాస గృహాల్లో చోరీ రంగాల్లోకి దిగిన క్లూస్ టీమ్
పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ప్రతినిధి
పొదిలి పట్టణం విశ్వనాథపురంలో రెండు నివాస గృహాల్లో చోరీ సంఘటన చోటుచేసుకుంది.
సంబంధిత విషయం తెలుసుకున్న పొదిలి యస్ఐ శ్రీహరి ఆధ్వర్యంలో పోలీసులు రెండు నివాస గృహాలను పరిశీలించి క్లూస్ టీం ను రంగంలోకి దింపారు.
చోరీ సంఘటన జరిగిన రెండు నివాస గృహాల్లో రెండు రోజులుగా గృహ యాజమానులు లేకపోవడాన్ని గుర్తించి చోరీ కి పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.
రెండో చోరీ సంఘటనల్లో చోరీ కి గురైన సోత్తు వివరాలు తెలియాల్సి ఉంది