బస్సు బైక్ ఢీ ఒకరికి తీవ్ర గాయాలు

పొదిలి మండలం ఉప్పలపాడు గ్రామ సమీపంలో ఆర్టీసీ బస్సు బైక్ ఢీకొని యువకుడు తీవ్రంగా గాయపడ్డ సంఘటన ఉప్పలపాడు పవర్ స్టేషన్ వద్ద జరిగింది. వివరాలకు వెళితే దరిశి వెలుగులో సి సి గా పనిచేస్తున్న పొదిలి చెందిన రాజయ్య(41) పొదిలికి వస్తుండగా పొదిలి చెందిన ఆర్టీసీ బస్సు ఒంగోలు వైపు వెళ్తుంది ఈ క్రమంలో బస్సు బైక్ ను ఢీ కొనటం జరిగింది. క్షతగాత్రుడిని వేరొక ఆర్ టి సి బస్సులో పొదిలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు.