వ్యాపార సంస్థలు కోవిడ్ ఆంక్షలు ధిక్కరిస్తే 25 వేలు జరిమానా : జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్

వ్యాపార సంస్థలు కోవిడ్ ఆంక్షలను ధిక్కరిస్తే 25 వేల రూపాయలు విధించాలని అధికారులకు జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు

వివరాల్లోకి వెళితే బుధవారం నాడు స్థానిక పొదిలి పెద్ద బస్టాండ్ వద్ద ఓమిక్రాన్ వైరస్ పట్ల అవగాహన సదస్సు ఏర్పాటు చేసిన క్రమంలో జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ హాజరై అధికారులకు కీలక ఆదేశాలు జారీచేశారు.

ఈ సందర్భంగా ఆయన అధికారులతో మాట్లాడుతూ కోవిడ్ ఆంక్షలను ధిక్కరించిన వ్యాపార సంస్థలకు 25 వేల రూపాయల జరిమానా విధించాలని పౌరులు మాస్క్ ధరించాక పోతే 100 రూపాయలు జరిమానా విధించాలని ఆదేశించారు.

వ్యాక్సిన్ ప్రక్రియ వేగవంతంగా పూర్తి చేసేందుకు ఇంటి ఇంటికి వెళ్ళి వ్యాక్సిన్ ప్రక్రియ పూర్తి చేయాలని అదే విధంగా సామాజిక దూరం ఉండి మాస్క్ తప్పకుండా ధరించే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు.

అదేవిధంగా ట్రాఫిక్ జామ్ కాకుండా నగర పంచాయితీ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

అధికారులందరూ సమిష్టిగా ఓమిక్రాన్ వైరస్ వ్యాప్తి నిరోధానికి చర్యలు చేపట్టాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో పొదిలి సిఐ సుధాకర్ రావు, మండల రెవెన్యూ తహశీల్దారు దేవ ప్రసాద్, మండల పరిషత్ అభివృద్ధి అధికారి శ్రీకృష్ణ, పొదిలి యస్ ఐ శ్రీహరి, ప్రభుత్వం వైద్యాధికారిణి షేక్ షహిదా , ఈఓఆర్డీ రాజశేఖర్ ,ఎపిఓ బుల్లెనరావు, నగర పంచాయితీ మేనేజర్ శ్రీకాంత్ రెడ్డి, శానిటరీ ఇన్స్పెక్టర్ మారుతిరావు తదితరులు పాల్గొన్నారు