బ్యాడ్మింటన్ సమ్మర్ క్యాంప్ ప్రారంభం

కరణం నాగేంద్రమ్మ పున్నయ్య చౌదరి ఛారిటబుల్ ట్రస్ట్ అధ్వర్యంలో పొదిలిలోని బ్యాంకు కాలనీ నందు షెటిల్ సమ్మర్ కోచింగ్ క్యాంపును ప్రారంభించారు.ఈ సంధర్భంగా ముఖ్యఅతిథిగా పాల్గొన్న పున్నయ్య చౌదరి మాట్లాడుతూ గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించడం కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని, సెంట్రల్ మరియు ట్రస్ట్ ద్వారా ఒక ఇండోర్ & అవుట్ డోర్ స్టేడియం ఏర్పాటు చేయడానికి కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులు జాతీయ బ్యాడ్మింటన్ ఉపాధ్యక్షులు కరణం పున్నయ్య చౌదరి , ఛైర్మెన్ టి నారాయణ రెడ్డి, ఆంద్రప్రదేశ్ కార్యదర్శి సిహెచ్ రఘు కిరణ్ , మన్నం నాగ రాజు, విజయ కుమార్ రెడ్డి, కోచ్ యమ్ నాగేశ్వరరావు, మరియు బ్యాడ్మింటన్ క్రీడాకారులు పాల్గొన్నారు.