కరోనా అవగాహన కోసం కొవ్వొత్తుల ర్యాలీ మానవహారం

                                        పొదిలి మండల టాస్క్ ఫోర్స్ కమిటీ ఆధ్వర్యంలో కరోనా వైరస్ నివారణ చర్యలపై అవగాహన కొవ్వొత్తుల ర్యాలీ, మరియు మానవహారం నిర్వహించారు.

వివరాల్లోకి వెళితే శుక్రవారం నాడు స్థానిక చిన్న బస్టాండ్ నుంచి పెద్ద బస్టాండ్ వరకు కరోనా వ్యాధి నివారణ పై కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో స్థానిక పెద్ద బస్టాండ్ సెంటర్లో మానవహారంగా ఏర్పడి కరోనా నివారణ చర్యల్లో భాగంగా చేతులుకడుకుందాం క్షేమంగా ఉందాం.!కరోనా అంతం అదే మన పంతం మాస్కులు ధరించండి కరోనాను నివారించండి అంటూ నినాదాలు చేస్తూ ప్రజలకు అవగాహన కల్పించారు…!

ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి శ్రీకృష్ణ, ఈఓఆర్డీ రాజశేఖర్, పంచాయతీ ప్రత్యేక అధికారి శ్రీనువాసులరెడ్డి, పంచాయతీ కార్యదర్శి నక్కా బ్రహ్మ నాయుడు, వివిధ శాఖల అధికారులు మరియు గ్రామ సచివాలయల సిబ్బంది వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు