కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి మృతి

నంద్యాల నంది పైపుల అధినేతగా ఆంధ్రా మరియు తెలంగాణా రాష్ట్రాలలోని రైతులకు అత్యంత సుపరిచితుడైన నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి హైదరాబాద్ లోని బంజారాహిల్స్ కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.

వివరాల్లోకి వెళితే గతకొంత కాలంగా గుండె, కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న ఎస్పీవై రెడ్డి ఏప్రిల్ 3వతేదీన తేదీన బంజారాహిల్స్ కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎస్పీవై రెడ్డి ఏప్రిల్ 30వతేది మంగళవారంనాడు తుదిశ్వాస విడిచారు.

1990 తన రాజకీయ ప్రస్తావనంన్ని బిజెపి నుండి ప్రారంభం చేసి 1991 లో నంద్యాల లోక్ సభ స్ధానం నుండి పోటీ చేసి ఓటమి చవిచూసారు 1999 లో నంద్యాల గిద్దలూరు శాసనసభ స్ధానలకు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి మరలా ఓటమి చవిచూసారు 2000 సంవత్సరం లో కాంగ్రెసు పార్టీ లో చేరి నంద్యాల మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్రంలో అత్యధిక మెజారిటీ తో గెలుపొందారు నంద్యాల పార్లమెంట్ సభ్యులుగా 2004, 2009 లలో కాంగ్రెసు పార్టీ తరుపున 2014 వైయస్ఆర్సీపి తరుపున మొత్తం మూడు పర్యాయలు వరుసగా ఎన్నికయ్యరు

నంద్యాల నంది పైపులు స్థాపించినప్పటి నుండి కర్నూలు జిల్లాలోని రైతులకు అలాగే నంద్యాల పరిసర ప్రాంత రైతులకు తన సేవలను అందిస్తూ రైతన్నలకు అత్యంత ఆప్తుడు అయిన ఎస్పీవై రెడ్డి మరణవార్త నంద్యాల ప్రాంత రైతులతో విషాదాన్ని నింపింది.