టిక్ టాక్ సహా 59చైనా యాప్ లపై నిషేధం విధించిన కేంద్రం
టిక్ టాక్ సహా 59చైనా యాప్ లను నిషేధిస్తూ భారత ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది.
వివరాల్లోకి వెళితే భారత్ భూభాగాన్ని అక్రమించుకోవాలనే చైనా కుట్రను తిప్పికొట్టే క్రమంలో మన జవాన్లు వీరోచితంగా పోరాడి చైనా కుట్రలకు అడ్డుకట్ట వేసే ప్రయత్నంలో ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే!……
మన వీర జవాన్లను పొట్టనపెట్టుకున్న చైనాపై ప్రతిచర్యలో భాగంగా భారత ప్రభుత్వం యుద్ధం ప్రారంభించింది…. ఈ నేపధ్యంలో భారత్ నుండి ప్రస్తుత పరిస్థితులలో చైనాకు ఆదాయం తెచ్చిపెడుతూ భారతీయుల సమాచారాన్ని తస్కరించే అవకాశం ఉన్నందున 59యాప్ లను నిషేధిస్తూ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది….. త్వరలోనే చైనా వస్తువులపై కూడా పూర్తిస్థాయి నిషేధం అమలుచేసే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం.