విద్యార్థులు క్రమశిక్షణతో విద్యను అభ్యసించి ఉన్నత స్థాయికి ఎదగాలి- హబీబుల్లా ఫౌండేషన్ చైర్మన్ కరిముల్లా బేగ్
విద్యార్థులు కళాశాలలో క్రమశిక్షణతో విద్యా అభ్యసించి భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలని హబీబుల్లా స్వచ్ఛంద సేవా సంస్థ చైర్మన్ మొగల్ కరిముల్లా బేగ్ అన్నారు.
శుక్రవారం నాడు స్థానిక పొదిలి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరిగిన ఫ్రెషర్స్ డే కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు.
చదువుల్లో బాగా రాణించి కళాశాలకు తల్లిదండ్రులకు అధ్యాపకులకు మంచి పేరు తీసుకురావాలని కోరారు.
విద్యార్థులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే ప్రతి ఏడాది తమ సంస్థ ద్వారా మెరిట్ స్కాలర్ షిప్ ఇస్తున్నట్లు గానే ఈ. సంవత్సరం అందిస్తున్నట్లు తెలిపారు
ఈ కార్యక్రమంలో జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ సిహెచ్ తారవాణి, బాలుర ఉన్నత పాఠశాల ఉపాధ్యాయురాలు కరిమున్ బీ, అధ్యాపక బృందం విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.