బిజెపి జెండా ఆవిష్కరించిన పొగాకు బోర్డు చైర్మన్

భారతీయ జనతాపార్టీ జెండాను భారత పొగాకు బోర్డు చైర్మన్ యడ్లపాటి రఘునాథ్ బాబు ఆవిష్కరించారు.

వివరాల్లోకి వెళితే బిజెపి రాష్ట్ర నాయకులు పొగాకు బోర్డు చైర్మన్ యడ్లపాటి రఘునాథ్ బాబు పొదిలి మండల పర్యటనలో భాగంగా ఆదివారం నాడు స్ధానిక పొదిలమ్మ దేవస్థానము నందు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం రాజుపాలెం గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన బిజెపి జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొని రైతులతో సమావేశం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో పొదిలి మండలం బిజెపి నాయకులు చెరెడ్డి శ్రీనివాసులు రెడ్డి మాకినేని అమరసింహా, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.