కుర్చీలు పంపిణీ చేసిన లాల్ ఫౌండేషన్
పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ప్రతినిధి:
లాల్ ఫౌండేషన్ సౌజన్యంతో అంగన్వాడీ కేంద్రాలకు కుర్చీలను పంపిణీ చేశారు.
శుక్రవారం నాడు స్థానిక నేతపాలెం అంగన్వాడీ కేంద్రంలో బండి అశోక్ అద్యక్షతన తో జరిగిన సమావేశంలో ముఖ్య అతిథులు హాజరైన ఐసిడిఎస్ ప్రాజెక్టు అధికారిణి సుధా మదురి, తహశీల్దారు అశోక్ కుమార్ రెడ్డి లాల్ ఫౌండేషన్ డైరెక్టర్ అలీ హాజీర్ చేతుల మీదుగా అంగన్వాడీ కార్యకర్తలకు కుర్చీలను పంపిణీ చేశారు
ఈ సందర్భంగా ఐసిడిఎస్ ప్రాజెక్టు అధికారిణి సుధా మదురి మాట్లాడుతూ పట్టణంలోని 20 అంగన్వాడీ కేంద్రాలకు ఒక కేంద్రానికి 10 కుర్చీలు చొప్పున మొత్తం 200 కుర్చీలు పంపిణీ చేయడం పట్ల లాల్ ఫౌండేషన్ సేవలను కొనియాడారు
ఈ కార్యక్రమంలో లాల్ ఫౌండేషన్ కోఆర్డినేటర్ షర్మిల, అంగన్వాడీ సంఘం నాయకురాలు శోభా మరియు ఐసిడిఎస్ ప్రాజెక్టు సిబ్బంది మరియు అంగన్వాడీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు