పొదిలి,కొనకనమిట్లలో ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు
పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ప్రతినిధి:
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 73 జన్మదిన వేడుకలను పొదిలి,కొనకనమిట్ల, మండలాల్లో ఘనంగా నిర్వహించారు.
పొదిలి ప్రభుత్వ వైద్యశాల నందు పండ్లను పంపిణీ చేశారు అనంతరం పొదిలి పెద్ద బస్టాండ్ సెంటర్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేక్ ను కోసి కార్యకర్తలకు పంచి పెట్టారు.
కొనకనమిట్లలో మండల పార్టీ అధ్యక్షులు మూరబోయిన బాబురావు యాదవ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ వైద్యశాల నందు పండ్లు పంపిణీ అనంతరం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేక్ ను కోసి కార్యకర్తలకు పంచి పెట్టారు.
మూరబోయిన బాబురావు యాదవ్ మాట్లాడుతూ ప్రస్తుతం దేశంలోని రాజకీయ నేతలలో అత్యంత అనుభవజ్ఞుడు, పరిపాలనా దక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారని… కరోనా తరవాతి ఈ క్లిష్టమైన సంధికాలంలో అటువంటి నాయకుని సేవలు అవసరమైన సమయంలో ఆంధ్ర రాష్ట్రప్రజలు పొరపాటు నిర్ణయ ఫలితంగా ఇప్పుడు అధిక ధరలతో, కరెంట్ కష్టాలతో,వివిధ రకాల పన్నులతో కష్టాల కొలిమిలో కాలిపోతు…బాధలు అనుభవిస్తున్నారని… చంద్రబాబు నాయుడు గారి అనుభవం అవసరం ఈ రోజు తెలుగుజాతి గుర్తించిందని.. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తెలుగుదేశం పార్టీని తిరిగి అధికారంలోకి తెచ్చుకోవడానికి ప్రజలు ఉవ్విళ్లూరుతున్నారని అంటూ చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో పొదిలి మండల తెలుగు దేశం పార్టీ నాయకులు యర్రం రెడ్డి వెంకటేశ్వర రెడ్డి కాటూరి నారాయణ ప్రతాప్ స్వర్ణ గీత షేక్ రసూల్ సమంతపూడి నాగేశ్వరరావు పండు అనిల్, మీగడ ఓబుల్ రెడ్డి ముల్లా ఖూద్దుస్ సయ్యద్ ఇమాంసా సన్నెబోయిన సుబ్బారావు యస్ ఎం భాషా,ముని శ్రీనివాస్, షేక్ గౌస్ భాష, జ్యోతి మల్లి నరసింహారావు, శ్రీదేవి కాటూరి శ్రీను తదితరులు పాల్గొన్నారు
కొనకనమిట్ల కార్యక్రమంలో చప్పిడి రామలింగయ్య, మాజీ టీడీపి మండల కన్వీనర్ వరికూటి వెంకటరామిరెడ్డి, ఒంగోలు పార్లమెంట్ తెలుగుయువత కార్యదర్శి మువ్వ కాటంరాజు, వేంపాటి శ్రీకాంతరెడ్డి, జిల్లా సాంకృతిక విభాగం కన్వీనర్ కొనంకి సల్మాన్, నాయకులు దేవిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, బాస్కర్ రెడ్డి, అంకాళ రోశయ్య, ముక్కల నరసింహరెడ్డి, శ్రీనివాసరెడ్డి, లెవి, కిరణ్, కె గురవయ్య, జీన్నయ్య, పెరికే రత్నం తదితరులు పాల్గొన్నారు