పొదిలి నగర పంచాయతీ కార్యాలయం మార్పు
పొదిలి నగర పంచాయితీ కార్యాలయాన్ని మార్పు చేసేందుకు నగర పంచాయతీ అధికారులు చకచకా ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు.
గత వారం క్రితం మార్కాపురం శాసన సభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి చేతుల మీదగా లాంఛనంగా ప్రారంభమైన ఐదవ సచివాలయ భవనం నందు నగర పంచాయతీ కార్యాలయాన్ని మార్చేందుకు నగర పంచాయతీ అధికారులు నిమగ్నమై ఉన్నారు.
గ్రామ పంచాయతీ నుంచి నగర పంచాయితీ రూపాంతరం చెందిన తర్వాత నగర పంచాయితీ కార్యాలయం నందు సిబ్బంది పెరగటంతో సరైన వసతులు లేని ప్రస్తుత నగర గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని నూతనంగా నిర్మించిన ఐదో సచివాలయంలోకి మార్చి నగర పంచాయితీ కొత్త భవనం పూర్తి అయ్యే వరకు ఇక్కడ నుంచి పాలనా కొనసాగేలా ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు.
ప్రస్తుతం ఉన్న నగర పంచాయితీ కార్యాలయం నుంచి సామాన్లు మొత్తం నూతన భవనంలోకి తరలించారు. సోమవారం నుంచి నూతన భవనం నుంచి పంచాయతీ పాలన జరిగే విధంగా అధికారులు యుద్ధ ప్రాతిపదికన చర్యలు ప్రారంభించారు