పొదిలిలో లొవొల్టేజి సమస్యకు చెక్
పొదిలిలో ఎఇ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో ఎడి సత్యనారాయణ 160 కెవిసి ట్రాన్స్ఫార్మర్స్ ఏర్పాటుతో లొవొల్టేజి సమస్య తీరినట్లు అయ్యింది.
గతకొంతకాలంగా పట్టణంలో లొవొల్టేజి సమస్యతో ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్న దృష్ట్య స్దానిక శివాలయం దగ్గర, పెద్దచెరువు సమీపంలో మంగళవారం నాడు ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేసారు.
గతంలో 100 కెవిఎ గా ట్రాన్స్ఫార్మర్లను 160 కెవిఎ మార్చారు. ఇందుకు దాదాపు ఆరులక్షల రూపాయల వ్యయం అయినట్లు ఎఇ అశోక్ కుమార్ తెలిపారు.
పట్టణంలో విద్యుత్ సమస్యలు ఏమున్నా తమ దృష్టికి తీసుకురావాలని ఆయన కోరారు
లొవొల్టేజి సమస్యను అధిగమించి ట్రాన్స్ఫార్మర్స్ ఏర్పాటు చేసినందుకు స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఈ కార్యక్రమంలో లైన్ ఇన్స్పెక్టర్ సుబ్బారెడ్డి,లైన్ మెన్ కొండలరావు, జెంపు రమణయ్య, విద్యుత్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.