చెట్టును ఢీకొన్న టిప్పర్ క్యాబిన్ లో ఇరుక్కున్న డ్రైవర్ సకాలంలో స్పందించి ప్రాణాలు కాపాడిన యస్ ఐ నాగరాజు
పొదిలి పట్టణం విశ్వనాధపురంలో తెల్లవారు జామున 4 గంటల సమయంలో టిప్పర్ డ్రైవర్ అతివేగంతో చెట్టును ఢీ కొట్టడంతో టిప్పర్ క్యాబిన్ లో డ్రైవర్ ఏసుబాబు (42) ఇరుక్కుని పోవడంతో డ్రైవర్ రోదనలతో చలించిన స్ధానికులు పొదిలి యస్ ఐ నాగరాజుకు చరవాణి ద్వారా సమాచారం అందించటంతో సంఘటన స్ధలానికి చేరుకొని వెంటనే యుద్ధప్రాతిపదికన ప్రొక్లేన్ మరియు గ్యాస్ కట్టర్ తెప్పించి స్థానికుల సహకారంతో అతి కష్టం మీద రెండు గంటలు కష్టపడి అతని ప్రాణాలను కాపాడారు అనంతరం 108 వాహనంలో ప్రభుత్వ వైద్య శాలకు తరలించారు. పొదిలి యస్ ఐ నాగరాజు చూపిన చొరవకు పొదిలి పట్టణ ప్రజలు అభినందనల వెల్లువలు కురిపించారు