బాల్యవివాహన్ని అడ్డుకున్న చైల్డ్ లైన్ అధికారులు… పోలీస్ స్టేషన్ లో తల్లిందడ్రులకు కౌన్సెలింగ్
పొదిలిలోని స్థానిక ఓబులశెట్టి వారి వీధిలో బాల్యవివాహం జరుపుతున్న సమాచారంతో చైల్డ్ లైన్ అధికారులు గురువారంనాడు వివాహాన్ని అడ్డుకున్నారు.
వివరాల్లోకి వెళితే పట్టణంలోని స్థానిక ఓబులశెట్టివారి వీధిలో నివాసం ఉంటున్న మైనర్ బాలిక ఇటీవల 10వ తరగతి పరీక్షలు రాసింది. అయితే గురువారంనాడు ఆ బాలికకు వివాహం జరిపించేందుకు కుటుంబసభ్యులు ఏర్పాట్లు చేసుకుంటుండగా చైల్డ్లైన్కేర్ 181కాల్ సెంటర్కు రాబడిన ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన చైల్డ్ లైన్ ప్రతినిధి మురళీకృష్ణ ఆధ్వర్యంలో స్త్రీ శిశు సంక్షేమశాఖ అధికారులు, రెవిన్యూ అధికారులు, పోలీసులు సంయుక్తంగా వివాహాన్ని అడ్డుకుని అనంతరం బాలిక తల్లిదండ్రులకు పోలీస్స్టేషన్లో కౌన్సిలింగ్ నిర్వహించారు.
బాల్యవివాహాల వలన జరిగే నష్టాలను గురించి వివరించి ఇటువంటి ఆలోచనలు మానుకోవాలని….. 18సంవత్సరాలు నిండకుండా వివాహం జరిపిస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో పొదిలి ఐసిడియస్ అధికారిణి కృష్ణవేణి, పొదిలి ఎస్ఐ శ్రీరామ్, సూపర్వైజర్ హైమావతి, ఆర్ఐ సుబ్బరాయుడు, తదితరులు పాల్గొన్నా