ఘనంగా బాలల దినోత్సవం వేడుకలు

జాతీయ బాలల దినోత్సవం వేడుకలు పొదిలి పట్టణంలో ఘనంగా నిర్వహించారు.

భవిత పాఠశాల

పొదిలి, కొనకానమిట్ల మర్రిపూడి మండలాల ఫోటోగ్రాఫర్స్ & వీడియో గ్రాఫర్స్ ఆధ్వర్యంలో బాలల దినోత్సవం సంబరాలు…….

పొదిలి మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో ఉన్న భవిత పాఠశాలలో నందు ఆధ్వర్యంలో పొదిలి ఫోటోగ్రాఫర్స్ యూనియన్ అధ్యక్షులు యద్దనపూడి బ్రహ్మం నాయకత్వంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కేక్ ను మండల విద్యాశాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి కోసి విద్యార్థులకు పెంచి పెట్టారు.

ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ ఖాసిం జాయింట్ సెక్రటరీ షేక్ అబ్దుల్లా సెక్రటరీ ఎడవల్లి శ్రీనివాసరావు గౌరవాధ్యక్షులు సురేష్ బావనేశ్వరరావు, రమేష్ తదితరులు పాల్గొన్నారు

సెయింట్ ఆన్స్ హైస్కూల్ లో అంబరాన్ని అంటిన బాలల దినోత్సవ సంబరాలు…
స్థానిక సెయింట్ ఆన్స్ హైస్కూల్ లో బాలల దినోత్సవం సందర్భముగా ఏర్పాటు చేసిన కార్య్రమంలో స్కూల్ డైరెక్టర్ నారాయణ సార్ నేహృగారి గొప్పతనాన్ని వివరించారు. హీడ్మిస్ జాకులినే ప్రస్తుత పోటీ యుగంలో బాలల ఏవిధంగా రానించాలో వివరించారు. భారీ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. స్టూడెంట్స్ అందరికి రుచికరమైన భోజన ఏర్పాట్లు చేశారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు , తల్లిదండ్రులు పాల్గొన్నారు