చైనీస్ తయారీ టపాసులపై నిషేధం

చైనా దేశపు టపాసులను నిషేధిస్తూ చెన్నై కస్టమ్స్ ప్రిన్సిపల్ కమిషనర్ ఉత్తర్వులు జారీచేశారు.


వివరాల్లోకి వెళితే చైనా తయారీ టపాసులులో పేలుడు నియమాలు 2008కి విరుద్ధంగా ఉండడమే కాకుండా జీవుల ఆరోగ్యానికి హాని కలిగించే పలురకాల రసాయనిక పదార్థాలు ఉండడంతో పర్యావరణం కూడా దెబ్బతినే అవకాశం ఉండడంతో ప్రజలను చైనా టపాసులును వినియోగించవద్దు అని కస్టమ్స్ అధికారులు సూచించారు.

అక్రమంగా ఏ పరిశ్రమ ద్వారా అయినా చైనా టపాసులు అమ్మబడుతూ ఉంటే అలాంటి వారిపై కస్టమ్స్ యాక్టు 1962 ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని….. అలాగే అమ్మకం కొనుగోలులో ప్రమేయం ఉన్న వ్యక్తులపై కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుందని…… అలాగే ప్రజలు ఎవరైనా చైనా టపాసులును గుర్తించినట్లైతే చెన్నై కస్టమ్స్ కంట్రోల్ రూమ్ 044-25246800 నంబరుకు తెలియజేయాలని చెన్నై కస్టమ్స్ ప్రిన్సిపల్ కమిషనర్ ప్రకటన విడుదల చేశారు.