చిన్నచెరువులో అక్రమంగా మట్టి తవ్వకాలకు పాల్పడుతున్న వాహనాలను సీజ్ చేసిన ఇరిగేషన్ అధికారులు.
చిన్నచెరువులో అక్రమంగా మట్టి తవ్వకాలకు పాల్పడుతున్న వాహనాలను ఇరిగేషన్ అధికారులు సీజ్ చేశారు తరలించారు.
వివరాల్లోకి వెళితే పట్టణంలోని స్థానిక చిన్నచెరువులో అక్రమంగా మట్టిని తరలిస్తున్న సమాచారంతో ఇరిగేషన్ అసిస్టెంట్ ఇంజనీర్ ఆదేశాలు మేరకు సూపరింటెండెంట్ ముల్లా మదార్ వలి తన సిబ్బందితో కలిసి శుక్రవారంనాడు తవ్వకాలు నిర్వహిస్తున్న ప్రొక్లెన్ ను, మట్టిని తరలించేందుకు ఉపయోగిస్తున్న రెండు ట్రాక్టర్లను సీజ్ చేశారు.
ఈ సందర్భంగా ఇరిగేషన్ సూపరింటెండెంట్ మదార్ వలి మాట్లాడుతూ అక్రమంగా చెరువులో మట్టిని తరలిస్తున్న సమాచారంతో ఆకాస్మిక తనిఖీకి రావడం జరిగిందని….. మట్టిని తవ్వి తరలిస్తున్న వాహనాలను సీజ్ చేయడం జరిగిందని…. సీజ్ చేసిన వాహనాలను పోలీసు స్టేషన్ కు తరలించి కేసులు నమోదు చేయడం జరుగుతుందని అన్నారు.