చిన్న, పెద్ద చెఱువుల ఆక్రమణలపై ఫిర్యాదు
పొదిలి పట్టణంలోని చిన్న చెరువు, పెద్ద చెరువుల ఆక్రమణలపై వైసీపీ యువజన సంఘం నాయకులు ఫిర్యాదు చేశారు.
వివరాల్లోకి వెళితే శుక్రవారంనాడు స్థానిక మండల రెవెన్యూ తహశీల్దార్ కార్యాలయం నందు తహశీల్దార్ జె ప్రభాకరరావుకు ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు.
ఈ కార్యక్రమంలో షేక్ గౌస్, జూపల్లి ఏడుకొండలు, తదితరులు పాల్గొన్నారు.