చిత్రలేఖనం, వ్యాసరచన పోటీలు నిర్వహించిన రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా శాఖ
రెడ్ క్రాస్ సొసైటీ ప్రకాశంజిల్లా శాఖ ఆధ్వర్యంలో పెద్దబస్టాండ్ లోని స్థానిక ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలనందు మంగళవారంనాడు చిత్రలేఖనం మరియు వ్యాసరచన పోటీలను ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు అధ్యక్షతన రెడ్ క్రాస్ సొసైటీ ప్రకాశంజిల్లా క్షేత్రాధికారి అబ్దుల్ కలాం నిర్వహించారు.
ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు మాట్లాడుతూ 7పాఠశాలల నుండి 100మంది విద్యార్థులు ఈ పోటీలో పాల్గొన్నారని ఆయన తెలిపారు.