దొంగతనం కేసులో ఒక్కరి అరెస్ట్ సొత్తు స్వాధీనం
దొంగతనం కేసులో ఒక్కరిని అరెస్టు చేసి సొత్తు స్వాధీనం చేసుకున్నట్లు పొదిలి సిఐ సుధాకర్ రావు తెలిపారు.
వివరాల్లోకి వెళితే పొదిలి పోలీసు స్టేషన్ నందు సోమవారం నాడు ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో సిఐ సుధాకర్ రావు మాట్లాడుతూ రాబడిన సమాచారం మేరకు స్థానిక పొదిలి యస్పికెపి డిగ్రీ కళాశాల వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న కరణి మల్లిఖార్జున అనే వ్యక్తిని పొదిలి సిఐ సుధాకర్, యస్ఐ సురేష్ ఆధ్వర్యంలో అరెస్టు చేసినట్లు తెలిపారు
గత నెలలో నిర్మల కాన్వేంట్ రోడ్డు లోని పాస్టర్ రాజశేఖర్ నివాసంలో జరిగిన దొంగతనం చేసిన కేసులోని బంగారం వెండిని సొత్తుని స్వాధీనం చేసుకొని అరెస్టు చేసిన వ్యక్తిని కోర్టు లో హాజరుపరచన్నట్లు తెలిపారు.
ఈ సమయంలో పొదిలి యస్ ఐ సురేష్ మరియు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు