పలు దొంగతనాల కేసుల్లో ముగ్గురు అరెస్టు: యస్ఐ కొమర మల్లిఖార్జునరావు
పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ప్రతినిధి:
పలు దొంగతనాల కేసుల్లో ముగ్గురు వ్యక్తులను శనివారం అరెస్టు చేసినట్లు పొదిలి ఠాణా అధికారి కొమర మల్లిఖార్జునరావు ఆదివారం నాడు ఒక ప్రకటనలో తెలిపారు.
వివరాల్లోకి వెళితే శనివారం సాయంత్రం దరిశి రోడ్ నందు ద్విచక్ర వాహనం పై అనుమానాస్పదంగా తిరుగుతున్న మాచర్ల గ్రామానికి చెందిన శీలం తిరుపతయ్య,సమరం నీలయ్య,కమరగిరి నీలయ్య లను అదుపులోకి తీసుకొని విచారించగా వారు పొదిలి, కొనకనమిట్ల, అద్దంకి, గుంటూరు జిల్లాలోని పాలడుగు, సత్తెనపల్లి వివిధ గ్రామాలలో దొంగతనాలకు పాల్పడినట్లు నిర్ధారించుకొని వారిని అరెస్ట్ చేసి వారి వద్ద నుండి పొదిలి పట్టణం నందు పాల్పడిన దొంగతనం కేసులలో రూ 10,000/- నగదు మరియు సుమారు 10 KG ల రాగి వైర్, కొనకనమిట్ల మండలంలోని దొంగతనం కేసులో సుమారు 4 గ్రాముల బంగారపు చెవి కమ్మలు మరియు ఒక జత వెండి కాళ్ళ పట్టీలు మరియు 5 మోటార్ సైకిల్ లను మొత్తం సుమారు రూ 2,30,000/- విలువ కలిగిన నగదు, రాగి వైర్ మరియు మోటార్ సైకిల్ లను తదుపరి దర్యాప్తు నిమిత్తం స్వదీనపరచుకొని రిమాండ్ నిమిత్తం ముగ్గురు ముద్దాయిలను కోర్ట్ నందు హాజరపరిచినట్లు ఠాణా అధికారి కొమర మల్లిఖార్జునరావు ఒక ప్రకటనలో తెలిపారు