ఘనంగా క్రిస్మస్ వేడుకలు

మండల పరిధిలోని అన్ని గ్రామాలలో క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు.

వివరాల్లోకి వెళితే క్రైస్తవులకు ఎంతో పవిత్రమైన యేసుక్రీస్తు జన్మదినమైన డిసెంబర్ 25 క్రిస్మస్ పండుగ సందర్భంగా పట్టణంలో అలాగే మండలంలోని అన్ని గ్రామాలలోని క్రైస్తవులు అన్ని చర్చీలలో ఉదయంనుండే ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

ఈ సందర్భంగా చర్చిలకు విద్యుద్దీప కాంతుల అలంకారం ప్రత్యేక ఆకర్షణగా నిలవగా….. క్రిస్మస్ తాత వేషధారణలో పలువురు చిన్న పిల్లలకు బహుమతులు అందజేశారు. పలువురు దాతలు చర్చిలలోని పేదలకు దుస్తులు తదితర అవసరాలను పంచిపెట్టారు.