విద్యుత్ ట్రాన్స్ఫర్ చోరీ సంఘటన స్థలాన్ని పరిశీలించిన సిఐ అజయ్ కుమార్

పొదిలి మున్సిపల్ పరిధిలోని కాటూరి వారి పాలెం పొలాల్లో ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫర్ చోరీ సంఘటన సోమవారం నాడు వెలుగులోకి వచ్చింది.

విషయం తెలుసుకున్న ఎపిటిసి సర్కిల్ ఇన్స్పెక్టర్ అజయ్ కుమార్ సంఘటన స్థలాన్ని పరిశీలించి చోరీ జరిగిన తీరును పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తరుచూ జరుగుతున్న ట్రాన్స్ఫర్ దొంగతనాల పైన నిఘా పెట్టామని కొంతమంది అనుమానితులును సమాచారాన్ని స్థానిక పోలీసు వారికి సమాచారాన్ని షేర్ చేసామని తెలిపారు.

ట్రాన్స్ఫర్ దొంగతనాల గురించి ఎవరి దగ్గర సమాచారం ఉంటే తమ శాఖ అధికారులకు లేక స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని ఆయన కోరారు.

ట్రాన్స్ఫర్ దొంగతనం సంఘటన పై స్ధానిక పోలీసు స్టేషన్ నందు ఫిర్యాదు చేసారని కేసు నమోదు చేసి నిందితులను త్వరలో అరెస్టు చేస్తారని తెలిపారు.

అనంతరం మర్రిపూడి మండల కేంద్రంలో జరిగిన ట్రాన్స్ఫర్ దొంగతనాలను పరిశీలించారు.

ఈ పర్యటనలో యస్ఐ కోటేశ్వరరావు, హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ మరియు లైన్ మెన్ కందుల నారాయణరెడ్డి, అసిస్టెంట్ సాయి తదితరులు పాల్గొన్నారు