ర్యాగింగ్ ఈవ్ టీజింగ్ కు దూరంగా ఉండాలి: సిఐ చిన్న మీరా సాహెబ్
ర్యాగింగ్, ఈవ్ టీజింగ్ వంటి వికృత చర్యలకు విద్యార్థులు దూరంగా ఉండాలని పొదిలి సిఐ చిన్న మీరా సాహెబ్ అన్నారు. కంభాలపాడు బెల్లంకొండ కళాశాలలో నూతన విద్యార్థుల ఆత్మీయ ఆహ్వాన వేడుక సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్య అతిధిగా హాజరైన పొదిలి సిఐ చిన్న మీరా సాహెబ్ మాట్లాడుతూ ఈవ్ టీజింగ్ మరియు ర్యాగింగ్ కేసులు నమోదు అయితే భవిష్యత్ అంధకారం అవుతుందని, అదేవిధంగా విద్యార్థులు హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడపరాదని అలాగే నడిపితే క్రిమినల్ కేసులు నమోదు అవుతాయని అన్నారు. కళాశాల కరస్పాండెంట్ బెల్లంకొండ శ్రీనివాసులు మాట్లాడుతూ విద్యతో పాటు జ్ఞానం కూడా సంపాదించాలని, తల్లిందడ్రులు యొక్క ఆకాంక్షకు అనుగుణంగా విద్యలో రాణించాలని అన్నారు. ప్రిన్సిపాల్ విజయలక్ష్మీ మాట్లాడుతూ ఆలోచనలు గొప్పగా ఉన్నప్పుడే పై స్ధాయికి ఎదుగుతారని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మాజీ విద్యా అధికారి కె లక్ష్మయ్య, విశ్రాంత ప్రిన్సిపాల్ ధర్మారావు, నారపుశెట్టి నాయుడు, ఎం శ్రీనివాసులు, వాటర్ షెడ్ ప్రాజెక్టు ఆఫీసర్ రామ్మోహన్ రావు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.