ట్రాఫిక్ నిబంధనల పట్ల ప్రతిఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి : సిఐ
ట్రాఫిక్ నిబంధనల పట్ల ప్రతిఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని సిఐ చిన్న మీరాసాహెబ్ అన్నారు.
వివరాల్లోకి వెళితే రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే రహదారి భద్రతా వారోత్సవాలలో భాగంగా కంభాలపాడులోని స్థానిక బెల్లంకొండ విద్యాసంస్థలలలో పొదిలి సిఐ చిన్న మీరాసాహెబ్, ఎస్ఐ శ్రీరామ్, మర్రిపూడి ఎస్ఐ మాధవరావులు రహదారి భద్రతా, ట్రాఫిక్ నిబంధనలు వంటి అంశాలపై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని అన్నారు. అతివేగం, రోడ్డుప్రమాదాలు, హెల్మెట్, సీటు బెల్టు, తదితర అంశాలపై విద్యార్థులకు వివరించారు.
రోడ్డు ప్రమాదాలను నివారణలో రహదారి నియమ నిబంధనలదే కీలకపాత్ర అని
మనకోసం ఎదురుచూస్తూ ఒక కుటుంబం ఉంటుందని ట్రాఫిక్ నియమనిబంధనలు పాటించి అందరూ సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బెల్లంకొండ విద్యాసంస్థల అదినేతలు బెల్లంకొండ శ్రీనివాసరావు, విజయలక్ష్మి, పోలీసు సిబ్బంది, అధ్యాపక సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.