పంచాయతీ కార్మికులకు బట్టలు పంపిణీ చేసిన సిఐ శ్రీరాం
నగర పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు పొదిలి సిఐ శ్రీరాం చేతుల మీదుగా బట్టలను పంపిణీ చేశారు.
వివరాల్లోకి వెళితే పొదిలి తాలూకా గ్రామీణ వైద్యుల సంఘం అధ్యక్షులు వెంకట్ రెడ్డి మరియు గణేష్ రెడ్డి జన్మదినం పురస్కరించుకొని సోమవారం నాడు స్థానిక నగర పంచాయతీ కార్యాలయం నందునగర పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు బట్టలు పంపిణీ చేసి ఇ అనంతరం వారికి అన్నదానం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సానికొమ్ము శ్రీనివాస్ రెడ్డి , జి శ్రీనివాస్ గొలమారి చెన్నారెడ్డి,కల్లం వెంకట సుబ్బారెడ్డి, వినోద్ ఉడుముల పిచ్చిరెడ్డి, వెంకట నారాయణ రెడ్డి మరియు నగర పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు