పట్టణంలో పలు ప్రాంతాల్లో పర్యటించిన సిఐ సుధాకర్
వివరాల్లోకి వెళితే శుక్రవారం నాడు పొదిలి సీఐగా బాధ్యతలు స్వీకరించిన సుధాకర్ శనివారం నాడు పట్టణంలోని స్థానిక పెద్ద బస్టాండ్ మాయాబజార్ వీధి ,తాలూక ఆఫీసు విధులను పరిశీలించారు. అదేవిధంగా విశ్వనాధపురం , పెద్ద బస్టాండ్ నుంచి చిన్న బస్టాండ్ వరకు పట్టణం మొత్తం కలియతిరిగారు.
వ్యాపారస్తులు రోడ్డు మార్గంలో పెట్టిన వస్తువులను తొలగించాలని తెలియజేశారు. పట్టణంలో కరోనా కేసులు అధికంగా ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మాస్కు ధరించి సామాజిక దూరం పాటించాలని ఆయన కోరారు
ఈ పర్యటనలో సిఐ వెంట పొదిలి ఎస్ఐ సురేష్ మరియు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు