క్లాప్ మిత్ర జీతాలకు ఎందుకు బటన్ నొక్కరు -సిఐటియు
పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ప్రతినిధి:
గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు చేస్తున్న క్లాప్ మిత్ర జీతాలు ఇవ్వక 13నెలలైనా బటన్ నొక్కటానికి ముఖ్యమంత్రికి చేతులు రాకుంటే ఇంటికి పంపెందుకు కార్మికులు బటన్ నొక్కుతారని సిఐటియు జిల్లా ప్రధానకార్యదర్శి యం రమేష్ అన్నారు.
గురువారం నాడు స్థానిక పొదిలి మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయం వద్ద ఎపి గ్రామ పంచాయితీ ఎంప్లాయిస్ &వర్కర్స్ యూనియన్(సిఐటియు) ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
ఈ ధర్నాలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం రమేష్ మాట్లాడుతూ పేదల సంక్షేమమే మా ధ్యేయం అంటున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నూటికి 95శాతం నిరుపేద దళుతులైన క్లాప్ మిత్రాలకు 13నెలలుగా జీతాలు చెల్లించకుంటే ఎలా బ్రతకుతారన్న సృహలేకపోవటం సిగ్గుచేటన్నారు.
బార్యబడ్డలను పస్తులుంచలేక ఇతర పనులకు వెళ్ళాల్సివస్తుందన్ని క్లాప్ మిత్ర జీతాలకు పంచాయితీ అభివృద్ధి కార్యక్రమాలకిచ్చే నిధులకు ముడి పెట్టడంతో జీతాలు సకాలంలో ఇవ్వలేకపోగా అభివృద్ధి పనులకు ఆటంకమేర్పడుతుందన్నారు.
పంచాయితీ అభివృద్ధి నిధులతో సంబంధం లేకుండా క్లాప్ మిత్ర కార్మికుల జీతాలకు ప్రత్యేకంగా నిధులు మంజూరు చేయాలని ప్రతినెలా 5వ తేదికి జీతాలు ఇవ్వాలన్నారు.
డ్యూటిలో గాయపడిన వారికి ప్రభుత్వమే ఉచితంగా వైద్య సౌకర్యం కల్పించాలని కార్మికులందరికి హెల్త్ అలవెన్స్ అమలు చేయాలని 2000సంవత్సరం నుండి పెంచిన 10వేతనాలు నేటికి అమలుకు నోచుకోలేదని ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి జీతాలు ఇచ్చి సమస్యలు పరిష్కరించకుంటే పోరాటాన్ని తీవ్రతరం చేయాల్సి వస్తుందన్నారు.
ఈ ధర్నాలో క్లాప్ మిత్ర కార్మిక నాయకులు టి జాన్ డేవిడ్,టి.ఇశ్రాయేల్ ,పేరయ్య,టి.నరసయ్య,వి.సంపూర్ణ,కోటయ్యలు తదితరులు పాల్గొన్నారు