బ్యాడ్జీలతో నిరసన తెలిపిన పంచాయితీ కార్మికులు
పొదిలి నగర పంచాయితీ కార్మికులకు ఐదు నెలల జీతాల బకాయిలు వెంటనే చెల్లించాలని కోరుతు
బ్యాడ్జీలు దరించి నిరసన వ్యక్తం చేశారు.
వివరాల్లోకి వెళితే సోమవారం తెల్లవారు ఎపి మున్సిపల్ వర్కర్స్&ఎంప్లాయిస్ యూనియన్(సిఐటియు) ఆద్వర్యంలో సోమవారం నుంచి బ్యాడ్జీలు పెట్టుకొని
తమకు రావాల్సిన ఐదు నెలలు జీతాలు కోసం నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా సిఐటియు పశ్చిమ ప్రకాశంజిల్లా ప్రదాన కార్యదర్శి యం రమేష్ మాట్లాడుతూ పొదిలి నగర పంచాయితీలో కార్మికులకు 5 నెలలుగా జీతాలు లేక ఆర్దిక ఇబ్బందులతో కుటుంబాలు గడవక మానసిక క్షోభ పడుతుంటే ప్రభుత్వం ,అదికారులు నిమ్మకు నీరేత్తినట్లు వ్యవహరించడం దారుణమన్నారు.నగర పంచాయితీగా మార్చిన ప్రభుత్వం పూర్తి స్థాయిలో అదికారాలు బదలాయించకపోవడంతో డబ్బులు మూలుగుతున్న కార్మికులకు జీతాలు చెల్లించలేని స్థితి నెలకొందని నగర పంచాయితీ సాదారాణ కార్యక్రమాలకు జీతాలకు ఆటంకం లేకుండా అవసరమైన అనుమతులు తెప్పించుకోవడంలో జిల్లా అదికారులు ,కమీషనర్ వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్థుందన్నారు.
ఫలితంగా 5 నెలలుగా జీతాలు లేక కార్మిక కుటుంబాలు ఆకలి బాధలతో నెట్టుకొస్థున్నారన్నారు.
సీజనల్ వ్యాదులకు తోడు,కరోనాతో కార్మిక కుటుంబాలకు వైధ్యానికి డబ్బులు పుట్టక దయనీయ పరిస్థితి ఎదుర్కొంటున్నారన్నారు.కరోనా రెండో విడత విజృంబిస్థున్నందున ప్రాణాలను ఫణంగా పెట్టి డ్యూటి చేస్థున్న కార్మికుల ఆరోగ్య పరిరక్షణకు మాస్కులు ,గ్లౌజులు ,శానిటైజర్ సరఫరా చేయాలన్నారు.విధులలో ప్రమాదానికి గురైన కార్మికులకు వైధ్యం చేయించాలన్నారు.పి.యఫ్.సమస్య పరిష్కరించాలని ,గత 3సంవత్సరాలుగా పెండింగులో ఉన్న యూనిఫాం,కాస్మోటిక్స్ వెంటనే ఇవ్వాలన్నారు.పై సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం ,అధికారులు తగిన చర్యలు తీసుకోకుంటే విధిలేని పరిస్థితిలలో ఈనెల 23 నుండి కార్మికులు నిరవదిక సమ్మెలోకి వెళతారన్నారు.
ఈకార్యక్రమంలో పొదిలి నగర పంచాయితీ యూనియన్ అధ్యక్షకార్యదర్శులు జి.నాగులు ,డి.సుబ్బయ్య ,ట్రెజరర్ బి.కోటేశ్వరావు ,నాయకులు కెవినరసింహం ,పి.సుబ్బులు ,బి.హజరత్తమ్మ ,ఎ.రాజయ్య తదితరులు పాల్గొన్నారు.