అంగన్వాడీ కార్యకర్తలను అక్రమంగా పోలీసు స్టేషన్ నిర్బంధింటం దుర్మార్గకరం: సిఐటియు
పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ప్రతినిధి:
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంగన్వాడీలకు ఇచ్చిన హామీలు అమలుచేయమంటే అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్లో నిర్బంధించడాన్ని సిఐటియు జిల్లా ప్రధానకార్యదర్శి రమేష్ తీవ్రంగా ఖండిస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు.
సోమవారం రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీలను అరెస్టు చేసి నిర్భందించడాన్ని నిరసిస్తూ సిఐటియు ఆధ్వర్యంలో పొదిలి పెద్ద బస్టాండ్ వద్ద మరియు ఎంపిడిఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు.
ఈ ధర్నాలో సిఐటియు జిల్లా కార్యదర్శి ఎం రమేష్ మాట్లాడుతూ ఎన్నికల ముందు అంగన్వాడీలకు నేటి ముఖ్యమంత్రీ ఇచ్చిన హామీలు అమలుచేయమనడం,వాటి కోసం శాంతియుతంగా ధర్నాలకు పిలుపునివ్వడం నేరమా అని ప్రశ్నించారు.
అరెస్టు చేసిన అంగన్వాడీలను అందరిని బేషరతుగా వెంటనే విడుదలచేయాలని 4సంవత్సరాలు కొవస్తున్నా ఇచ్చిన హామీలు అమలుచేయకపోగా మహిళలని కూడా చూడకుండా అర్ధరాత్రులు మార్గమధ్యంలో అరెస్టులు చేసి స్టేషన్ కు తరలించి నిర్ందించడం ప్రభుత్వ దమనకాండకు పరాకాష్ఠ అన్నారు.
జిల్లాలో మద్దిపాడు, త్రిపురాంతకం,పొన్నలూరు,సింగరాయకొండ,కురిచేడు లలో వందలాది మంది అంగన్వాడీలను అరెస్టు చేసి ఇప్పటికి వదలిపెట్టలేదని అంగన్వాడీల పట్ల దుర్మార్గంగా వ్యవహరించిన గత ప్రభుత్వాలు కాలగర్భంలో కలిసిపోయాయన్నారు. ఈ ప్రభుత్వానికి గత ప్రభుత్వాలకు పట్టిన గతిపట్టకముందే అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలన్నారు.
ఈ ధర్నాలో సిఐటియు పొదిలి మండలం కార్యదర్శి బండ కోటేశ్వరరావు,నాయకులుయం.శోభారాణి,జ్యోతి, నాగమణి,ప్రజావతి,కృపారావు,నాగలక్ష్మి,ఇందిర, కెవి.నరసింహం,డి.సుబ్బయ్య,జి.నాగులు, వెంకటేశ్వర్లు , అంగన్వాడీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు