పంచాయతీ ఒప్పంద కార్మికులు ధర్నా
పంచాయతీ ఒప్పంద కార్మికులకు గత ఐదు నెలలుగా జీతాలు చెల్లించకపోవడంపై నిరసనగా సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
వివరాల్లోకి వెళితే మంగళవారంనాడు స్థానిక పంచాయతీ కార్యాలయం వద్ద ఒప్పంద కార్మికుల ధర్నా కార్యక్రమాన్ని ఉద్దేశించి పలువురు మాట్లాడుతూ తక్షణమే ఐదు నెలల జీతం మరియు గత ఎనిమిది సంవత్సరాలుగా ఉన్న పియఫ్ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు ఎం రమేష్, సయ్యద్ హనీఫ్, పంచాయతీ కార్మిక సంఘం నాయకులు కె వి నరసింహం, జి ఏసోబు, జి సబ్బాయ్య, జి నాగులు, చిన్న వెంకట నరసయ్య తదితరులు పాల్గొన్నారు.