సిఐటియు 5వ మండల మహాసభ జయప్రదం చేయండి: రమేష్
భారత కార్మిక సంఘ కేంద్రం ( సిఐటియు) పొదిలి మండల మహాసభను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి ఎం రమేష్ పొదిలి టైమ్స్ కు తెలిపారు.
వివరాల్లోకి వెళితే డిసెంబర్ 1వ తేదీ ఆదివారం సాయంత్రం 3గంటలకు స్థానిక పెద్ద బస్టాండ్ లోని బాలికల ఉన్నత పాఠశాలలోని సమావేశ మందిరంలో మండల మహాసభ జరుగుతుందని కావున ఆశా కార్యకర్తలు, పంచాయతీ కార్మికులు, మధ్యాహ్నం భోజన పథకం కార్మికులు, గ్రామ రెవెన్యూ సహాయకులు, వివిధ రకాల ముఠా కార్మికులు, తదితర రంగాలలో పనిచేసే కార్మికులు హాజరై ఈ కార్యక్రమన్ని జయప్రదం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.