కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులను బానిసలుగా చేసే ప్రయత్నంలో ఉన్నాయి: ఎం రమేష్
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులను యాజమాన్యాలకు బానిసలను చేసేవిధంగా పని చేస్తున్నాయని సిఐటియు జిల్లా కార్యదర్శి ఎం రమేష్ అన్నారు.
వివరాల్లోకి వెళితే ఆదివారంనాడు స్థానిక బాలికల ఉన్నత పాఠశాల సమావేశ మందిరంలో సిఐటియు మహాసభలు ప్రభుదాసు, నాగులు, శోభరాణీ అధ్యక్షతన జరగగా ముఖ్య అతిథిగా హాజరైన ఎం రమేష్ మాట్లాడుతూ కార్మికులకు 178రూపాయల రోజు కూలీ ఇవ్వడం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిరకుంశ వైఖరికి అద్దం పడుతుందని….. అదేవిధంగా డిసెంబర్ 5, 6తేదీల్లో కనిగిరిలో జరిగే పశ్చిమ ప్రకాశం సిఐటియు జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని అన్నారు.
ఈ మహాసభలలో వివిధ అనుబంధ కార్మికుల సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.